14 రోజుల క్వారంటైన్ లో చరణ్, ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా…?

0
244

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్న ప్రకారం జరిగి ఉంటే 2021 సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై ఉండేది. అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాల్లానే ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. అయితే దర్శకధీరుడు రాజమౌళి అతి త్వరలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.

వీలైతే ఈ నెల చివరి వారం నుంచి లేదంటే వచ్చే నెల తొలివారం నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడంతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా మిగిలిన భాగం చిత్రీకరణకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా మిగిలిన 30 షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది.

షూటింగ్ సమయంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా నటీనటులందరూ ఈ నెల 10 నుంచి హోటల్స్ లో క్వారంటైన్ లో ఉండాలని సూచించారని సమాచారం. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కూడా షూటింగ్ లో పాల్గొంటూ ఉండటంతో వాళ్లు కూడా క్వారంటైన్ లో ఉండబోతున్నారని సమాచారం.

అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తైతే 2021 దసరా పండుగ సందర్భంగా లేదా 2022 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. రాజామౌళి డైరెక్షర్ లో బాహుబలి సిరీస్ తరువాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ సులువుగా బాహుబలి2 కలెక్షన్లను క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించే చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here