Ram charan-true jet: మెగా పవర్ స్టార్ ఇటు సినిమాలతో పాటు అటు వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే అతని స్నేహితుడితో కలిసి ఏయిర్ లైన్స్ బిజినెస్ ప్రారంభించిన సంతగతి తెలిసిందే. ఇటు హీరోగా… నిర్మాతగా కూడా రామ్ చరణ్ సక్సెస్ సాధిస్తున్నాడు. 2015లో చరణ్ తన స్నేహితుడితో కలసి ట్రూజెట్ పేరుతో డొమెస్టిక్ ఎయిర్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈ విమానాలు హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు తమ ట్రూజెట్ ద్వారా విమానయాన సేవలు అందిస్తోంది.

విమానయానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు తక్కువ ధరకే సేవలను అందించాలని తన స్నేహితుడు ఉమేష్ తో కలిసి టర్బో మోగా ఎయిర్వేస్ సంస్థను ప్రారంభించారు రామ్ చరణ్. ఈ సంస్థ ట్రూజెట్ పేరుతో సర్వీసులను నడుపుతోంది. జులై 12, 2015న సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఇదిలా ఉంటే త్వరలోనే ఈ విమానయాన సంస్థ మూతపడుతుందనే వార్తలు వస్తున్నాయి.

ట్రూజెట్ విమాన సంస్థ తీవ్ర నష్టాల్లో నడుస్తుందని.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేని ఆర్థిక పరిస్థితి దిగజారిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ట్రూజెట్ స్పందించింది. ట్రూజెట్ విమానాలను ఆపేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఇలాంటి వార్తలు నమ్మవద్దని సంస్థ స్పందించింది. ఈ సంస్థలో పని చేసే కొంత మంది అధికారులు రిజైన్ చేసి వెళ్లిపోవడం వల్ల.. వారి స్థానంలో కొత్తవాళ్లను నియమించామని.. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు కూడా వస్తున్నట్లు వెల్లడించింది.
త్వరలోనే కొత్త సీఈఓ..
ఇన్వెస్టర్లు వచ్చాక ట్రూజెట్ కొత్త సీఈఓను ప్రకటించే అవకాశం ఉంది. అప్పటి వరకు మేనేజింగ్ డైరెక్టర్ గా.. సీఈఓగా ఉమేస్ కొనసాగుతారని సంస్థ చెప్పకొచ్చింది. అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ కారణాల వల్ల విమానాలను నిలిపివేసినట్లు తెలిపింది. త్వరలోనే మళ్లీ ప్రారంభిస్తామని.. నవంబర్ 2021 నుంచి ఉద్యోగులకు ఒక్క పైసా చెల్లించడం లేదని వచ్చే వార్తల్లో నిజం లేదని అన్నారు. వారికి కొంత జీతాలు ఇచ్చామని.. తక్కువ సాలరీ ఉద్యోగులకు పూర్తిస్థాయి జీతాలు ఇచ్చామని ఓ ప్రకటనలో ట్రూజెట్ సంస్థ తెలియజేసింది.


































