Ram Charan: ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ ఇటీవల అయ్యప్ప మాల వేసుకుని కడప అమీన్ పీర్ దర్గా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఇలా రామ్ చరణ్ దర్గా వెళ్లడం పట్ల ఎంతోమంది హిందువులు దీనిని తప్పుగా ఖండిస్తూ వచ్చారు. ఎంతో పరమ పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి రామ్ చరణ్ ఇలా దర్గా వెళ్లి ఓ సమాధిని దర్శించుకోవడం ఏంటి అంటూ మండిపడటమే కాకుండా వెంటనే ఆయన మాల తొలగించాలని క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తన భర్త గురించి ఈ విధమైనటువంటి విమర్శలు వస్తున్న తరుణంలో ఉపాసన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు మేము హిందూ మత ఆచారాలను పాటిస్తాము అలాగే ఏ ఇతర మతాలను కూడా అగౌరవపరచమని అన్ని మతాలను ఒకే దృష్టితో గౌరవిస్తామని ఉపాసన చెప్పుకువచ్చారు. అయితే తాజాగా తనికెళ్ల భరణి రామ్ చరణ్ అయ్యప్ప మాలతో దర్గా వెళ్లడం గురించి స్పందించారంటూ ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా మతం అంటే కలిపేది విడదీసేది కాదంటూ తనికెళ్ల భరణి ఓ సినిమాలో చేసిన కామెంట్స్‌కు రామ్ చరణ్ దర్గాను దర్శించుకున్న ఫొటోలు సింక్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తనికెళ్ల భరణి మతాల గురించి మాట్లాడుతూ..41 రోజులు నిష్ఠగా మాల వేసుకునే అయ్యప్ప స్వామి భక్తులు ముందుగా వెళ్లేది బాబర్ స్వామి మసీద్ కి. మతం అంటే కలిపేదే విడిచేది కాదని తెలిపారు.ఇప్పేడేమిటి ఎన్నో శతబ్దాలుగా ఇక్కడ హిందువులు ముస్లింలు కలిసే ఉంటున్నారు. బీబీ నాంచరమ్మను వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్నారు. అందుకే కడపలో ఇప్పటికి కూడా ముస్లింలు ఉగాది పండుగ వస్తే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి వారు ప్రత్యేకంగా పూజలు చేస్తారు వెంకటేశ్వర స్వామి స్వయంగా వారి ఇంటి అల్లుడుగా భావిస్తారు కనుక ముస్లింలు పూజలు చేస్తారని తెలిపారు.

Ram Charan:మతం అంటే కలిపేది..
వేములవాడ రాజన్న ఆలయంలో ఒక దర్గా ఉంది. శివ భక్తుల్ని ముస్లిం మత పెద్దలు ఆశీర్వదించే అపూర్వ దృశ్యం మనం అక్కడ చూడొచ్చు. ఇక చార్మినార్ లో ఒక బినార్ కింద సాక్షాత్తు అమ్మవారి విగ్రహం ఉందని అక్కడ పెద్ద ఎత్తున పూజలు కూడా చేస్తారు అంటూ ఒక సినిమాలో తనికెళ్ల భరణి మతాల గురించి చేసినటువంటి ఈ వీడియోని ఇప్పుడు రాంచరణ్ అభిమానులు షేర్ చేస్తున్నారు అయితే ఈ వీడియో పై కూడా విభిన్న రకాలుగా నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

































