టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా, కాంట్రవర్సి డైరెక్టర్ గా పేరు పొందిన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసే ట్వీట్స్ కి ఎలాంటి అర్థంపర్థం ఉండదు. తాను చేసే ఈ విధమైనటువంటి ట్వీట్స్ ద్వారా పెద్ద వివాదం చెలరేగుతోంది. అయినప్పటికీ ఈయన చేసే ప్రవర్తన, అడిగే ప్రశ్నలు మనకు విసుగు తెప్పించిన అందులో ఏదో ఒక లాజిక్ తప్పకుండా ఉంటుంది. ఈ క్రమంలోనే కరోనా వేరియంట్లు పై రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

కరోనా వైరస్ వేరియంట్ లకు పేర్లు పెట్టడం సాధారణం. అయితే ఆ పేర్లు మనకు గుర్తుండని విధంగా,ఎవరికీ అర్థం కాకుండా Bi7172, Nk4421, K9472 , AV415 లాంటి పేర్లు ఎందుకు పెడుతున్నారు ?వైరస్ వేరియంట్లకు కూడా ప్యారేలాల్, చింటూ, జాన్ డేవిడ్, సుబ్బారావు ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టారంటూ శాస్త్రవేత్తలను వర్మ ప్రశ్నించారు.
ఈ విధంగా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ కి పలువురు స్పందిస్తూ సైంటిఫిక్ సమాధానాలు చెప్పగా మరి కొందరు ఈ అద్భుతమైన తెలివితేటలు ఉండటం వల్లే సినిమాలు తీస్తున్నావంటు వర్మపై సెటైర్లు కురిపించారు. మొత్తానికి వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొద్దిరోజుల నుంచి వర్మ బిగ్ బాస్ బ్యూటీ అరియనాతో జిమ్ లో చేసిన రచ్చ మర్చిపోకముందే మరోసారి ఈ విధంగా కరోనా వేరియంట్ లపై స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.






























