Ram Gopal Varma: ఇటీవల సినిమా టికెట్ల వ్యవహారం పెద్ద దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో మొదలైన ఈ యుద్దం నానీ దగ్గర నుంచి చివరకు ఆర్జీవీ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఏపీ మంత్రి పేర్నీ నానికి.. ఆర్జీవీకి మధ్య మాటల యుద్ధమే నడించింది.

టికెట్ల రేట్లను పెంచడానికి ఎందుకు ఇబ్బంది..? ఎందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని ఆర్జీవీ ప్రభుత్వాన్ని అనేక ప్రశ్నలు వేశాడు. అంతే కాదు దీనిపై కోడాలి నానీ మాట్లాడుతుంటే.. అతడు ఎవరో తెలియదు అంటూ కౌంటర్ ఇచ్చాడు. అంతే కాకుండా ఆ ట్వీట్ కు కోడాలి నానీ కూడా రీ కౌంటర్ ఇచ్చాడు.

చాలామందికి ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయం చాలామందికి తెలియదు అని.. ఇక నేను ఏం తెలుస్తాను.. త్వరలోనే అందరూ తెలుసుకుంటారు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇటీవల ఆర్జీవిని పేర్నీనాని ప్రభుత్వంతో కలిసి సినిమా టికెట్లపై మాట్లాడేందుకు అపాంట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జవనరి 10వ తేదీన అతడికి అపాయింట్ మెంట్ దొరికింది. దీనిపై ఆర్జీవీ.. ధన్యవాదాలు కూడా తెలిపాడు.
మీరిచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ క్రిమినల్ యాస్పెక్ట్స్ లో ఉన్నాయి..
అయితే ఓ మీమ్ ఆర్జీవీ కి సంబంధించి వైరల్ గా మారింది. దానిని స్వయంగా ఆర్జీవీ ట్యాగ్ చేశాడు.
దానిలో ఏముందంటే.. ‘‘టికెట్ రేట్లు పెంచేవాడికి, ప్రేక్షకుడికి ఇబ్బంది లేనప్పుడు ప్రభుత్వానికి ఏంటి నొప్పి..? విటుడికి .. వేశ్యకి ఇబ్బంది లేనప్పుడు పోలీసుకు ఏంటి నొప్పి..? లంచం ఇచ్చేవాడికి తీసుకునే వాడికి లేని నొప్పి.. ఏసీబీకి ఎందుకు నొప్పి..? బ్లూఫిల్మ్ తీసేవాడికి.. చూసేవాడికి ఇబ్బంది లేనప్పుడు సెన్సార్ వాళ్లకు ఎందుకు నొప్పి..? అంటూ ఓ మీమ్ ఉంది. దీనిని ట్యాగ్ చేస్తూ ఆర్జీవీ ఇలా అన్నాడు.. ‘‘ఒరేయ్ సుబ్బారావు ల్లారా నేను అడిగిన క్వశ్చన్ లీగల్ జ్యూరిస్ట్రిక్షన్ లో ఉంది. మీరిచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ క్రిమినల్ యాస్పెక్ట్స్ లో ఉన్నాయి’’ అంటూ ట్వీట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒరేయ్ సుబ్బారావు ల్లారా నేను అడిగిన క్వశ్చన్ లీగల్ జ్యూరిస్ట్రిక్షన్ లో ఉంది. మీరిచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ క్రిమినల్ యాస్పెక్ట్స్ లో ఉన్నాయి pic.twitter.com/LUe16OXZAW
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2022































