Ramabanam: రామబాణం సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.. గోపీచంద్ ఫస్ట్ ఛాయిస్ కదా?

0
42

Ramabanam: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రామబాణం. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు మే ఐదవ తేదీ వచ్చింది. ఇలా మే ఐదవ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులు అంచనాలను చేరుకోలేక పోయినప్పటికీ పరవాలేదు అనిపించుకుంది.

ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హైదీ నటించారు.జగపతిబాబు కుష్బూ వంటి సెలబ్రిటీలు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.గోపీచంద్ హీరోగా నటించిన లక్ష్యం లౌక్యం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీ వాస్ ఈ సినిమాకు డైరెక్టర్ గా పని చేశారు. ఇక ఈ సినిమా గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమా కథ సిద్ధం చేసుకునే సమయంలోనే ఈ సినిమాకు బాగా ఎత్తు, లావు ఉన్నటువంటి హీరో అయితే కరెక్ట్ గా సరిపోతారని భావించి ఈ కథను సిద్ధం చేశారట అయితే ఈయన అప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ కథ సిద్ధం చేశారని తెలుస్తుంది. అయితే కథ మొత్తం పూర్తయిన తర్వాత హీరో వరుణ్ తేజ్ ను కలిసి ఈ సినిమా కథ వినిపించారట.

Ramabanam: వరుణ్ తేజ్ ఫస్ట్ ఛాయిస్…


కథ మొత్తం విన్నటువంటి వరుణ్ తేజ్ ఈ సినిమా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఉండడమే కాకుండా చాలా ఎమోషన్స్ ఉండటంతో అలాంటి ఎమోషన్స్ సన్ని వేశాలలో నటించడానికి తాను పెద్దగా సూట్ అవునన్న ఉద్దేశంతో ఈ సినిమాని వదులుకున్నారని తెలుస్తోంది..ఇలా వరుణ్ తేజ్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో అలాంటి కటౌట్ ఉన్నటువంటి హీరో అయిన గోపీచంద్ కు ఈ సినిమా కథను వినిపించి రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ వరుణ్ తేజ్ అని ఆయన రిజెక్ట్ చేస్తేనే గోపీచంద్ ఈ సినిమాలో నటించారని తెలుస్తుంది.