“నలుగురిని చూడూ.. ముగ్గురిని సెలెక్ట్ చెయ్.. ఇద్దరినీ ట్రై చెయ్.. ఒక్కరిని పెళ్లి చేసుకో..” ఇది కళ్యాణ రాముడు సినిమాలో వేణు తొట్టెంపూడి చెప్పిన డైలాగ్. అక్షారాల అదే ఫాలో అయింది ఉత్తరప్రదేశ్ లోని ఒక అమ్మాయి. అసలు విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా లో నివశిస్తున్న ఒక అమ్మాయి, ఏకంగా నలుగురు యువకులను ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించింది.

నిజం ఎంతోకాలం దాగదు కదా.. ఏదోలా విషయం తెలుసుకున్న నలుగురు యువకులు కలిసి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళారు. దీనితో రంగంలో దిగిన గ్రామస్తులు వారిని ఊరికి తీసుకొచ్చి ఆయువకులలో ఎవరో ఒకరిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. నీకు ఎవరంటే ఇష్టం ఆని ఆ అమ్మాయిని అడగగా.. ” తనకు అందరూ ఇష్టమే ” అని సమాధానం ఇచ్చింది. దీనితో మీలో ఎవరో ఒకరిని నిర్ణయించుకోండి అని అబ్బాయిలని అడిగితె వారు కూడా తెల్చుకోలేకపోయారు. దీనితో చేసేదేం లేక గ్రామస్తులు లక్కీ డ్రా తీసారు. అందులో పేరు వచ్చిన యువకుడితో పెళ్లి చేసారు.






























