Ramya Krishna: బాహుబలి కోసం జక్కన్నకే అలాంటి కండిషన్స్ పెట్టిన రమ్యకృష్ణ… ఏంటో తెలుసా?

0
37

Ramya Krishna: సీనియర్ నటి రమ్యకృష్ణ హీరోయిన్గా ఎన్నో సినిమాలలో నటించి ఒకానొక సమయంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇప్పుడు కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తాజాగా రజనీకాంత్ సరసన నటించిన జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యకృష్ణ బాహుబలి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తనకు సెకండ్ ఇన్నింగ్స్ లో బాహుబలి సినిమా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది అని తెలిపారు.

Ramya Krishna: రాత్రిపూట షూటింగ్ కు రాను..


ఇక ఈ సినిమా అవకాశం తనకు వచ్చినప్పుడు తాను రాజమౌళి గారికి కొన్ని కండిషన్స్ పెట్టానని వాటికి ఒప్పుకుంటేనే ఈ సినిమాలో నటిస్తానని చెప్పినట్లు రమ్యకృష్ణ వెల్లడించారు. రాజమౌళి వంటి అగ్ర దర్శకుడికి ఈమె పెట్టిన కండిషన్స్ ఏంటి అనే విషయానికి వస్తే… ఈ సినిమా కోసం ఎక్కువగా కాల్ షీట్స్ ఇవ్వనని తెలిపారట. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ కోసం తాను రాత్రిపూట అసలు రానని కేవలం పగలు మాత్రమే షూటింగ్ కి వస్తానంటూ కండిషన్లు పెట్టక రాజమౌళి కూడా ఒప్పుకున్నారని ఈమె తెలిపారు.