Ramya Ragupathi: టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్ రమ్య రఘుపతిల వ్యవహారం రోజురోజుకు తీవ్ర వివాదంగా మారుతుంది.నరేష్ మూడవ భార్య అయినటువంటి రమ్య రఘుపతి తన నుంచి గత కొంతకాలంగా దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే నటుడు నరేష్ మరొక నటి పవిత్ర లోకేష్ కు దగ్గరయ్యారు. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించడంతో రమ్య రఘుపతి సీన్లోకి ఎంట్రీ ఇచ్చి తనకు విడాకులు ఇవ్వకుండా వారు ఎలా వివాహం చేసుకుంటారని అడ్డుపడ్డారు.

ఇలా రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వకపోవడంతో నరేష్ కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా రమ్య రఘుపతికి సంబంధించిన ఒక ఆడియో కాల్ ప్రస్తుతం లీక్ అవడంతో నరేష్ ఈ విషయంపై కోర్టును ఆశ్రయించారు. రమ్య రఘుపతి కేవలం డబ్బు కోసమే ఇలా తనని వేధిస్తోందని తను డబ్బు మనిషి అంటున్నారు. ఆమె తాజాగా మధ్యవర్తితో మాట్లాడుతున్నటువంటి ఒక ఆడియో కాల్ తన వద్ద ఉందని 10 కోట్ల రూపాయలు ఇస్తే తాను సెటిల్మెంట్ కి వస్తానని మాట్లాడారంటూ నరేష్ వెల్లడించారు.
రమ్య రఘుపతి ఆస్తి కోసమే ఇలా తనని చిత్రహింసలకి గురి చేస్తుందని ఆస్తి కోసం ఏకంగా తనని చంపేయడానికి కూడా ఆమె ప్రయత్నాలు చేశారంటూ ఆరోపించారు. ఇలా డబ్బు కోసం భర్తనే చంపిన తన వద్ద తన కొడుకు ఉండడం సురక్షితం కాదని రమ్య రఘుపతి తన కుమారుడి జీవితాన్ని కూడా నాశనం చేస్తుందని నరేష్ ఆరోపించారు. అందుకే తన కుమారుడికి గార్డియన్ గా తనను నియమించాలని ఈయన కోర్టును వేడుకున్నారు.

Ramya Ragupathi: రమ్య వద్ద నా కుమారుడు వద్దు..
తన కుమారుడు చదువుల నిమిత్తం ప్రతి ఏడాది తాను నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నానని రమ్య వద్ద తన కుమారుడు ఉంటే తన భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని నరేష్ తెలిపారు.అందుకే తన కుమారుడికి తనని గార్డియన్ గా ఉంచి రమ్యతో తనకు విడాకులు ఇప్పించాలని ఈయన కోర్టులో వేడుకున్నారు. ప్రస్తుతం రమ్య గురించి నరేష్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై రమ్య ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
































