తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్ ఉన్నవాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరి నెల నుంచి రేషన్ పొందాలంటే మొబైల్ నంబర్ కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ను రేషన్ డీలర్ కు తెలియజేయాలి. ఓటీపీ అథంటికేషన్ ద్వారా మాత్రమే ఫిబ్రవరి నెల నుంచి రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుంది. సాధారణ రేషన్ కార్డులతో పాటు అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ కార్డులు ఉన్నవాళ్లకు కూడా ఇదే నిబంధన వర్తించనుంది.

కరోనా విజృంభణ వల్ల రాష్ట్రంలో ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి బయోమెట్రిక్ అథంటికేషన్‌ ను నిలిపివేసింది. అయితే బయోమెట్రిక్ అథంటికేషన్‌ ను నిలిపివేయడం వల్ల అక్రమాలు జరిగే అవకాశాలు ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఓటీపీ ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ చేపడుతోంది. నివేదికల ప్రకారం రేపటి నుంచి అమలులోకి రానున్న ఈ నిబంధన గురించి తెలుసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో రేషన్ కార్డును కలిగి ఉన్న కుటుంబాలు ఆధార్ కార్డు నంబర్ కు మొబైల్ ఫోన్ నంబర్ ను రిజిష్టర్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ రిజిష్టర్ చేసుకోని వారు సమీపంలోని ఆధార్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించడం ద్వారా రిజిష్టర్ చేసుకోవచ్చు. అవగాహన ఉన్నవాళ్లు యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా కూడా వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. వన్ టైమ్ పాస్ వర్డ్ చెప్పలేకపోతే రేషన్ సరుకులు తీసుకోవడం సాధ్యం కాదు.

రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఈ దిశగా ఓటీపీ ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here