Ravanasura: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్, ప్లాప్ తో సంబంధం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవల ధమాకా సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న రవితేజ ఇప్పుడు రావణాసర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.

సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 8 వ తేది థియేటర్లలో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పై ప్రేక్షకులలో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ విడుదల తేది గురించి తాజా వార్త వెలువడింది. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ లలో విడుదల చేస్తున్నారు. మరికొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన కొంతకాలానికి ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు.
ఇక తాజాగా విడుదలైన రావణాసుర సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అప్డేట్ బయటికి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రావణాసుర ఓటీటీ హక్కులను చేజిక్కించుకుంది. ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నట్లు తెలుస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో క్రైమ్ త్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న రవితేజ నటించిన ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Ravanasura: పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న రావణాసుర…
ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సినిమా మీద అంచనాలు రెట్టింపు చేశాయి. ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా గురించి ప్రేక్షకులలో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా రవితేజకి ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి హిట్ ఇస్తుందో లేదో చూడాలి మరి. ఇక ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.































