Ravi Teja -Sharwanand: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఓకే సినిమా కథను పోలి మరొక సినిమా రావడం సర్వసాధారణం ఇప్పటివరకు ఇలా ఒకే కథతో రెండు మూడు సినిమాలు వచ్చాయి.అయితే ఒకే కథతో వచ్చిన సినిమాలు రెండు కొన్నిసార్లు విజయవంతమైన సందర్భాలు ఉన్నాయి మరి కొన్నిసార్లు డిజాస్టర్ అయిన సందర్భాల్లో ఉన్నాయి. కథ పాతదైన దాన్ని రూపొందించే విధానం కొత్తది అయితే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇలాంటి ఒకే కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో నటుడు రవితేజ శర్వానంద్ ఒకరు. వీరిద్దరూ కూడా వేరు వేరు సినిమాల ద్వారా వచ్చినా కూడా కథ మాత్రం ఒకటే.శర్వానంద్ హీరోగా రణరంగం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈయన ఒక డాన్ హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత శత్రువులు హీరోయిన్ ని చంపేస్తారు. అయితే హీరోయిన్ ని చంపినది తన ఫ్రెండేనని ట్విస్ట్ ఇందులో ఉంది.
ఇక రవితేజ హీరోగా డిస్కో రాజా సినిమా కూడా ఇలాంటిదే. రవితేజ కూడా హీరోయిన్ ప్రేమించడం పెళ్లి చేసుకున్న తర్వాత డాన్ గా మారడం అనంతరం శత్రువులు తనని చంపేస్తారు. అయితే ఇందులో కాస్త సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇలా ఈ రెండు సినిమాలు ఒకే కథతో ప్రేక్షకుల ముందుకు రాగా రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.

Ravi Teja -Sharwanand: రెండు సినిమాలలో కామన్ పాయింట్…
ఈ విధంగా ఇండస్ట్రీలో ఒకే కథతో సినిమాలు రావడం సర్వసాధారణం. అయితే కొన్ని సార్లు రెండు సినిమాలు కూడా సక్సెస్ సాధించిన సందర్భాలు ఉన్నాయి.ఇక ప్రస్తుతం రవితేజ శర్వానంద్ ఇద్దరు కూడా హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. రవితేజ తాజాగా ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నారు.
































