2016 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేయడంతో ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే పెద్దనోట్ల రద్దు నిర్ణయమే ప్రజలకు భారీ షాక్ కాగా కేంద్రం మరో భారీ షాక్ ప్రజలకు ఇవ్వడానికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ఆర్‌బీఐ కీలక అధికారి పాత 100, 10, 5 కరెన్సీ నోట్లను ఆర్బీఐ రద్దు చేయనున్నట్టు కీలక వ్యాఖ్యలు చేశారు.

మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఆర్బీఐ పాత కరెన్సీ నోట్లను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మరో షాకింగ్ నిర్ణయం దిశగా ఆర్బీఐ వేస్తున్న అడుగులు సామాన్య ప్రజలకు షాక్ అనే చెప్పాలి. న్యూఢిల్లీలో ఒక సమావేశంలో అధికారి మహేష్ మాట్లాడుతూ చాలామంది వ్యాపారులు 10 రూపాయల నాణేన్ని ప్రవేశపెట్టే 15 సంవత్సరాలు అయినా తీసుకోవడానికి ఇష్టపడటం లేదని పేర్కొన్నారు. 10 రూపాయల కాయిన్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు.

అయితే ఆర్బీఐ నిజంగానే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తుందో లేదో తెలియాల్సి ఉంది. ఒకవేళ పాత 100, 10, 5 కరెన్సీ నోట్లను ఆర్బీఐ రద్దు చేస్తే ఆ నోట్లను మార్చుకోవడానికి ఎంత సమయం ఇసుందనే వివరాలు సైతం వెల్లడి కావాల్సి ఉంది. గతేడాది 2000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆర్బీఐ స్పందించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.

అయితే నోట్ల రద్దు గురించి ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరి కొంతమంది మాత్రం పాత నోట్లను రద్దు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here