రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. 241 సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. https://www.rbi.org.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లో ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

జనవరి 22వ తేదీన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 12వ తేదీలోగా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం జనవరి 1 నాటికి 25 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఆన్‌లైన్ టెస్ట్‌, ఫిజిక‌ల్ టెస్ట్ లకు హాజరు కావాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్ లైన్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ పరీక్ష 100 మార్కులకు ఉండగా 80 నిమిషాల్లో ఈ పరీక్ష రాయాల్సి ఉన్ట్ఉంది. సెక్షనల్ కటాఫ్, నెగిటివ్ మార్కులు ఉండవు.

100 మార్కుల పరీక్షలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లో 40 ప్రశ్నలు 40 మార్కులకు, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ లో 30 ప్రశ్నలు 30 మార్కులకు, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి. ఆర్బీఐ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here