మీరు ఎక్కువగా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా..? అయితే ఇది మీకు నిజంగానే ఒక చేదు వార్త అని చెప్పవచ్చు. ఏటీఎంల నుంచి తరచూ డబ్బులను డ్రా చేసే వారికి ఇది నిజంగానే షాకింగ్. ఈ క్రమంలోనే పలు ఏటీఎం లావాదేవీలకు సంబంధించిన చార్జీలను ఇకపై పెంచుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తెలిపింది.

ప్రస్తుతం ఉచిత లావాదేవీల అనంతరం ఏటీఎం ఇంటర్ చేంజ్ ఫీజు రూ.15 మాత్రమే ఉండేది ఇకపై దీనిని రూ. 18 పెంచింది. ఈ క్రమంలోనే నాన్ ఫైనాన్షియల్ చార్జీలను రూ.5 నుంచి రూ 6 లకు పెంచింది.ఈ విధంగా అధికమొత్తంలో పెంచిన ఫీజులను ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి అని ఆర్బిఐ వెల్లడించింది.

ప్రస్తుతం బ్యాంకుల నుంచి నెలకు అధిక మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే వారు ఇకపై ఉచిత లావాదేవీల అనంతరం ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేవారికి ఏకంగా రూ.21ల ఫీజు వసూలు చేయడానికి ఆర్బిఐ అనుమతి తెలిపింది. ఈ విధమైనటువంటి చార్జీలు జనవరి 1 2022 నుంచి అమలులోకి వస్తాయి.

ప్రస్తుతం కస్టమర్లు ఏటీఎం నుంచి ఉచితంగా ఐదు సార్లు డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఆరవసారి డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే వారు రూ.21 లు చెల్లించాలి.అదేవిధంగా ఖాతాదారులు బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో కాకుండా ఇతర బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకున్నట్లయితే మూడు సార్లు మాత్రమే ఉచితంగా పొందవచ్చు. నాలుగవ సారి ట్రాన్సాక్షన్ జరిపితే ఆ కాతా దారులు రూ.21 ల ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here