కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ప్రతి సంవత్సరం మే, జూన్ నెలలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యేవి. అయితే ఈ సంవత్సరం మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యంగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రాష్ట్రీయ కెమిక‌ల్స్ అండ్ ఫెర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 358 ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ సెక్ర‌టేరియ‌ల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, అటెండెంట్ ఆప‌రేట‌ర్‌, స్టెనోగ్రాఫ‌ర్ ఉద్యోగాల భర్తీ జరగనుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా డిసెంబర్ 22 దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది. https://www.rcfltd.com/ వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. విభాగాలను బట్టి 8వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఉద్యోగాన్ని బట్టి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు ట్రైనింగ్ ఉంటుంది. 50 శాతం ఉత్తీర్ణతతో కొన్ని ఉద్యోగాలకు వయస్సు అర్హతను బట్టి ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఉద్యోగాలకు సంబంధించి వయో సడలింపులు ఉంటాయి.

అయితే ఈ ఉద్యోగాలకు వేతనం తక్కువగా ఉండటం గమనార్హం. ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 7,000 రూపాయల నుంచి 9,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. అయితే ఉద్యోగంలో చేరిన తరువాత అనుభవం ఆధారంగా వేతనాల పెంపు జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here