Connect with us

Featured

శరీర బరువు తగ్గాలనుకుంటున్నారా… అయితే ఈ సూప్ తాగాల్సిందే!

చాలా మంది వివిధ రకాల కారణాల వల్ల అధిక శరీర బరువును పెరుగుతున్నారు.ఈ క్రమంలోనే శరీర బరువును తగ్గించడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు.

Published

on

చాలా మంది వివిధ రకాల కారణాల వల్ల అధిక శరీర బరువును పెరుగుతున్నారు.ఈ క్రమంలోనే శరీర బరువును తగ్గించడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. చాలా మంది శరీర బరువును తగ్గించుకోవడం కోసం వారి ఆహారంలో కఠిన నియమాలను తీసుకుంటూ ఉంటారు. అయితే శరీర బరువు తగ్గాలనుకొనే వారు ఎలాంటి కఠినమైన ఆహార నియమాలను పాటించకుండా కేవలం శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

Advertisement

చాలా మంది వివిధ రకాల కారణాల వల్ల అధిక శరీర బరువును పెరుగుతున్నారు.ఈ క్రమంలోనే శరీర బరువును తగ్గించడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. చాలా మంది శరీర బరువును తగ్గించుకోవడం కోసం వారి ఆహారంలో కఠిన నియమాలను తీసుకుంటూ ఉంటారు. అయితే శరీర బరువు తగ్గాలనుకొనే వారు ఎలాంటి కఠినమైన ఆహార నియమాలను పాటించకుండా కేవలం శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

Advertisement

శరీర బరువు తగ్గాలని భావించేవారికి క్యాబేజ్ సూప్ ఒక అద్భుత ఔషధం. ప్రతిరోజు రాత్రి ఈ సూప్ తాగటం వల్ల తొందరగా శరీరంలో క్యాలరీలను తగ్గించుకొని శరీర బరువును తగ్గవచ్చు. క్యాబేజీలో అధికశాతం పోషక విలువలు మనకు లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్లు, సోడియం, పొటాషియం, క్యాల్షియం,నియాసిన్, రిబోఫ్లేవిన్, థియామిన్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇన్ని పోషకాలు కలిగినటువంటి ఈ క్యాబేజీని కూర కన్నా, సూప్ చేసుకొని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

ఈ సూప్ తయారు చేయడానికి ఒక ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, పచ్చిమిర్చి, నల్ల మిరియాలు, ఉప్పు, క్యాబేజీ తురుముకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద అ అ గోళంలో నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా, నల్ల మిరియాలను వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత క్యాబేజీ తురుము వేసి ఒక నాలుగు ఐదు కప్పుల నీటిని వేసి బాగా మరిగించాలి. ఈ మరిగిన నీటిని వడపోసి అందులోకి కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

Advertisement

ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఈ క్యాబేజ్ సూప్ తాగటం వల్ల శరీరంలోని అధిక కేలరీలు, మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ పెరిగి శరీర బరువు తగ్గడానికి దోహదపడుతుంది.ఈ విధంగా బరువు తగ్గాలని భావించే వారు వారి డైట్ లో భాగంగా క్యాబేజీ చేర్చడం వల్ల తొందరగా బరువు నియంత్రించుకోవచ్చు.

Advertisement

Featured

Rana: మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ పై జోక్స్ వేసిన రానా… ఫైర్ అయిన హరీష్ శంకర్?

Published

on

Rana: ఇటీవల రవితేజ హీరోగా డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్ ఈ సినిమా ఎన్నో అంచనాలను ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఏ మాత్రం కలెక్షన్స్ లేకపోవడంతో డిజాస్టర్ గా నిలిచింది.

Advertisement

ఇక ఈ సినిమా డిజాస్టర్ గురించి రానా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దుబాయిలో జరిగిన ఐఫా ఉత్సవం అవార్డ్స్ ఫంక్షన్ లో రానా, తేజ సజ్జా జోకులు వేశారు. రానాతో పాటు ఈ కార్యక్రమానికి తేజ సజ్జ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ సరదా సరదాగా పలు సినిమాల గురించి మాట్లాడారు.

బచ్చన్ గారు ఈ ఏడాది హైయెస్ట్ హై చూశారు లోయస్ట్ లో చూశారు అని రానా అంటే హైయెస్ట్ అయితే కల్కి మరి లోయస్ట్ లో ఏమిటి అని అడిగితే అదే ఈ మధ్య వచ్చింది కదా మిస్టర్ అంటూ ఉండగా తేజా సజ్జ ఏ అలా మాట్లాడొద్దు అంటూ ఆపారు. అయితే ఇక్కడ మిస్టర్ బచ్చన్ సినిమా గురించి పూర్తిగా చెప్పకపోయినా మిస్టర్ అని చెప్పడంతో కచ్చితంగా రవితేజ సినిమా డిజాస్టర్ గురించి మాట్లాడారని తెలుస్తుంది.

అన్ని రోజులు ఒకేలా ఉండవు..
ఇక ఈ విషయంపై రవితేజ అభిమానులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ అన్న ఎవరైతే ఇలా మీ సినిమాల గురించి మాట్లాడారో వారే క్లాప్స్ కొట్టాలి అంటే మీరు కచ్చితంగా హిట్ సినిమా చేయాలి అంటూ కామెంట్ చేయగా మరికొందరు డైరెక్టర్ హరీష్ శంకర్ ని టాగ్ చేశారు. రవితేజ గారితో ఒక సినిమా చేయాలి మళ్లీ మేము కాలర్ ఎగరేయాలి దీనికి మీ రిప్లై కావాలన్నా అంటూ పేర్కొన్నారు. దానికి హరీష్ శంకర్ ఎన్నో విన్నాను తమ్ముడు అందులో ఇదోటి. అన్ని రోజూలు ఒకేలా ఉండవు, నాకైనా ఎవరికైనా అంటూ రాసుకొచ్చారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Sai pallavi: సాయి పల్లవికి కొత్త బిరుదు ఇచ్చిన నాగచైతన్య… తనతో కష్టం అంటూ కామెంట్స్?

Published

on

Sai pallavi: సినీ నటుడు నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కాబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు నాగచైతన్య నటి సాయి పల్లవి గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. అంతేకాకుండా ఆమెకు సరికొత్త బిరుదు కూడా ఇచ్చారు. ఇప్పటికే సాయి పల్లవిని నేచురల్ బ్యూటీ అని లేడీ పవర్ స్టార్ అనే బిరుదులతో పిలుస్తారు తాజాగా బాక్సాఫీస్ క్వీన్ అంటూ మరో బిరుదుని ఇచ్చారు.

సాయి పల్లవి సినిమా సెట్ లో ఉంటే కేవలం తన పాత్ర గురించి మాత్రమే కాకుండా నా పాత్ర గురించి కూడా ఎంతో క్లారిటీతో ఉంటూ నాకు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటారని తెలిపారు. ఇక సాయి పల్లవి తో నటించాలన్న కాస్త కష్టంగా ఉంటుంది.ఆమెతో కలిసి డాన్స్ చేయాలంటే నాకు కాస్త భయం వేస్తుంది అంటూ నాగచైతన్య ఈ సందర్భంగా సాయి పల్లవి నటన డాన్స్ పై ప్రశంసలు కురిపించారు.

డాన్స్ చేయాలంటే భయం..
గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్‌ గురించి వినగానే నాకు చేయాలనిపించింది. తండేల్ చాలా గొప్ప చిత్రం అవుతుంది. నా పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులను కలిశానని అన్నారు. ఈ సినిమా జాలరి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Allu Aravind: అయ్యయ్యో…ఆ స్టార్ హీరోయిన్ ను బన్నీకి చెల్లిని చేసిన అల్లు అరవింద్?

Published

on

Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అరవింద్ తాజాగా తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి ఏడో తేదీ విడుదలకు సిద్ధమైంది.

Advertisement

ఇలా విడుదల తేదీన ప్రకటించడం కోసం చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి. ఇటీవల సాయి పల్లవి అమరన్ సినిమాలో నటించిన విషయం తెలిసినదే. ఈ సినిమాలో సాయి పల్లవి నటనకి మంచి మార్కులే పడ్డాయి.

ఈ సినిమా గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇటీవల తాను అమరన్ సినిమా చూశాను. సాయి పల్లవి తన నటనతో అందరిని అదరగొట్టేసింది. చివరిగా కన్నీళ్ళతో బరువెక్కిన హృదయంతో బయటకు వచ్చాను కారులో కూర్చుని అదే ఎమోషన్ లో సాయి పల్లవికి ఫోన్ చేసి మాట్లాడానని అల్లు అరవింద్ తెలిపారు.

కూతురితో సమానం..
నాకు కూతుర్లు లేరు కూతురు కనుక ఉండి ఉంటే సాయి పల్లవి లాగే ఉండాలని కోరుకుంటాను ఆమె నాకు కూతురుతో సమానం అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అయ్యయ్యో ఈ స్టార్ హీరోయిన్ పట్టుకొని బన్నీకి చెల్లిని చేశారు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!