నోటి పూతను తగ్గించే అద్భుత చిట్కాలు ఇవే!

0
229

మనలో చాలా మంది బాధపడే సమస్యలలో నోటిపూత ఒకటి. కొంతమంది తరచూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు.ఈ విధంగా నోట్లో పెదవులపై లేదా నాలుక పై తెల్లని మచ్చలు ఏర్పడటాన్ని నోటిపూత అని చెబుతారు. మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు, లేదా మన శరీరంలో విటమిన్ శాతం తక్కువగా ఉన్నప్పుడు తరచూ ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యతో బాధపడే వారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నా ఎంతో మంటగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఈ సమస్య వల్ల జ్వరం కూడా రావచ్చు. ఎక్కువగా ఈ సమస్యతో బాధపడే వారికి సులువైన మార్గం ద్వారా విముక్తి పొందవచ్చు. అయితే ఆ మార్గాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

నోటి పూత సమస్యతో బాధపడే వారు తేనెతో సులభంగా చెక్ పెట్టవచ్చు. తేనెలో ఎక్కువ శాతం మైక్రోబియల్ గుణాలున్నాయి.దీనివల్ల నోటి పూత సమస్యను నుంచి తొందరగా విముక్తిని కలిగిస్తాయి. అదే విధంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం కోసం ఎక్కువ శాతం ద్రావణాలను తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఈ విధంగా ద్రావణ పదార్థాలను తీసుకోవడం ద్వారా నోటి పూత సమస్యకు చెక్ పెట్టొచ్చు. పచ్చి కొబ్బరి,లేదా ఎండుకొబ్బరి ముక్కలను తినడం వల్ల తొందరగా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

మన ఇంటి ఆవరణంలో ఉన్న తులసి మొక్క ఎన్నో ఔషధాలకు నిలయమని భావిస్తారు. ఇన్ని అవధ గుణాలు కలిగిన తులసి ఆకులను నీళ్లతో కలిపి నమలడం వల్ల నోటి పూత సమస్యను నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు.అదే విధంగా ఏ ప్రదేశంలో అయితే ఈ సమస్య ఏర్పడి ఉంటుంది ఆ ప్రదేశంపై లవంగం నూనె రాయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. అదేవిధంగా నోటి పూత ఉన్న భాగంలో ఐస్ ముక్కతో మసాజ్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ఈ సులువైన మార్గాలను పాటించడం ద్వారా నోటి పూత సమస్యను నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ఈ సులువైన మార్గాలను పాటించిన అప్పటికీ ఈ సమస్య తగ్గకపోతే ఒకసారి వైద్యులను సంప్రదించవలసిన అవసరం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here