Renu Desai: సినీనటి రేణు దేశాయ్ ప్రస్తుతం తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా ఈమె ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా నటిగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి ఈమె సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి.

తాజాగా ఈమె చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా రేణు మీడియాను అలాగే సోషల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఎంతోమంది యూట్యూబర్ లు తమ వ్యూస్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి దారుణమైనటువంటి వార్తలు రాస్తూ ఉంటారు.
ఇలా మా వ్యక్తిగత జీవితాల గురించి వార్తలు రాయటమే జర్నలిజమా అంటూ ప్రశ్నించారు.ఇలా మా గురించి వచ్చే నెగిటివ్ కామెంట్లు కనుక చూస్తే సమాజంలో ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి వారు కూడా ఉన్నారా అన్న భావన కలుగుతుందని తెలిపారు .మీలాగే మేము కూడా మనుషులమే మేము కూడా కొన్ని తప్పులు చేస్తాము. అంతమాత్రాన మా వ్యక్తిగత విషయాల గురించి ఇలాంటి వార్తలు రాసి మీరు డబ్బు సంపాదించడం మంచి పద్ధతి కాదు.
సెలబ్రిటీలు కూడా తప్పులు చేస్తారు…
సెలబ్రిటీలు కూడా ప్రేమలో పడటం విడాకులు తీసుకోవడం వంటివి జరుగుతూ ఉంటుంది ఇలా మాకు తెలియకుండా కూడా మేము కొన్ని తప్పులు చేస్తుంటాము. ఇలాంటి వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని వార్తలు రాయడం మంచి పద్ధతి కాదు అని ఈమె తెలిపారు. నేను ఇలా చేసినటువంటి ఈ పోస్ట్ పై కూడా ఎన్నో నెగటివ్ కామెంట్లు వస్తాయి కానీ నిజం ఏది అబద్దం ఏది అనే విషయాలు మీకు తెలుసు అంటూ రేణు దేశాయ్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.































