కడప జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి 1గంట సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మైదుకూరు –బద్వేలు జాతీయ రహదారిపై డి. అగ్రహారం వద్ద ఇన్నోవా, మినీ లారీ ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్ప పోందుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు చెందిన ఏడుగురు వ్యక్తులు ఇన్నోవాలో కడపలో జరిగే వివాహా కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

చిత్తూరు నుంచి టమాటా లోడుతో వస్తున్న మినీ లారీ డి.అగ్రహారం వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ల కారణంగా ఇన్నోవాను ఢికొట్టింది. పరిమితి మిచ్చిన వేగంతో ఉన్న రెండు ఒకదానికి ఒకటి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మృతదేహాలను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.





























