Roja: బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం రెండవ సీజన్లో భాగంగా రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించడంతో ఈ కార్యక్రమం పై పలువురు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నారని తెలియడంతో ఈ ఎపిసోడ్ కాస్త పెద్ద ఎత్తున రాజకీయ చర్చలకు కారణమైంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఎపిసోడ్ గురించి ఇప్పటికే వైసీపీ నేతలు స్పందించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ మంత్రి సినీనటి రోజా సైతం కార్యక్రమం పై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి మెగా కుటుంబానికి పెద్దగా సఖ్యత లేదని విషయం మనకు తెలిసిందే. గతంలో మెగా హీరోలు బాలకృష్ణ గారి గురించి పెద్ద ఎత్తున అనుచిత వ్యాఖ్యలు చేశారు.అయితే ఇలా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఇద్దరు కలిసి ఒకే వేదికపై సందడి చేయడంతో రోజా స్పందిస్తూ కేవలం పవన్ కళ్యాణ్ బాలకృష్ణ షో కి రావడం కూడా ప్యాకేజీలో భాగమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Roja: పవన్ టాక్ షోకి రావడం వెనుక చంద్రబాబు హస్తముంది…
పవన్ కళ్యాణ్ ను బద్ధ శత్రువుగా భావించే బాలకృష్ణ కార్యక్రమానికి పవన్ వెళ్లడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని రోజా వెల్లడించారు. గతంలో ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నటువంటి మెగా నందమూరి హీరోలు ఇప్పుడు ఏ ఉద్దేశంతో కలిసారని ఈమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు నాయుడుతో పొత్తు కలుపుకోవడం కోసమే ఈ షో కి హాజరయ్యారని ఇది కూడా ప్యాకేజీలో భాగమే అంటూ రోజా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































