Roopa Maganti : నాన్న గురించి చెబుతూ ఎమోషనల్ అయిన రూప మాగంటి…!

0
199

Roopa Maganti : సీనియర్ నటుడు మురళీ మోహన్ గారి కోడలిగా వ్యాపారవేత్తగా అలాగే రాజకీయ నాయకురాలిగా ప్రజా సేవకురాలిగా అలానే ఇంటి కోడలిగా ఇలా అనేక బాధ్యతలను నెరవేరస్తూ ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్న వ్యక్తి రూప మాగంటి. రూప మాగంటి చెన్నై లో ఎకేవి ప్రసాద్ గారికి జన్మించారు. ఆమె తండ్రి సినిమా నిర్మాతగా కొన్ని సినిమాలను తీశారు. ఇక తాత లోకసభ కు గుడివాడ నుండి పోటీ చేసి గెలిచిన వ్యక్తి. ఇక ఆమె నాయనమ్మ గారు పెమ్మసాని వంశస్థురాలు కావడం విశేషం. ఇక తాజాగా రూప మాగంటి గారు ఆమె తండ్రి గారితో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ప్రతి ఆడపిల్లకు పుట్టిల్లు స్వర్గ సీమ…

రూప మాగంటి చదువుయ్యాక శ్రీలంకలో ఐఎల్ఓ అప్రెంటీస్ గా చేరి ప్రభుత్వ సలహాదారుగా పనిచేసారు. ఆమె పెళ్లయ్యాక మురళీ మోహన్ గారి ఇంటి కోడలిగా ఆ ఇంటి బాధ్యతలు చూస్తూనే ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన స్టార్ట్అప్ మొదలు పెట్టి ఇటు రాజకీయాల్లోను అడుగుపెట్టారు. అయితే ఆమె తన తండ్రి గురించి మాట్లాడుతూ ఏ ఆడపిల్లకైనా పుట్టిల్లు స్వర్గమే అంటూ చెప్పారు.

ఇక ఆమె సోదరి బ్రిందా కూడా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమె మన ఇండియాలో ప్రతిష్టాత్మక అవార్డు సైమా అవార్డ్స్ వ్యవస్థాపకురాలు. తమ తండ్రి గురించి ఇద్దరూ మాట్లాడారు. తల్లి నవమాసాలు మోసి కంటే తరువాత పెరిగి పెళ్లయ్యే వరకు బాధ్యత తండ్రిదే. మా నాన్న మాకు హీరో అంటూ చెప్పారు. ఇక రూప మాగంటి గారు మాట్లాడుతూ తన తండ్రి తరువాత మా మామ గారు నన్ను కూతురిలా చూసుకున్నారు అంటూ చెప్పారు.