Sadha: బలవంతంగా బంధాలలో ఉండడం కన్నా ఒంటరితనమే మంచిది… నటి సదా కామెంట్స్ వైరల్!

0
22

Sadha: తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన జయం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి సదా.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన నటనతో అందంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమెకు విపరీతమైన అభిమానులు పెరిగిపోవడమే కాకుండా వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

ఈ విధంగా సదా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.ఇక గత కొంతకాలంగా సినిమాకు దూరంగా ఉన్నటువంటి సదా బుల్లితెర ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. బుల్లితెరపై ప్రసారమయ్యే డాన్స్ షోలకు ఈమె జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు. అదేవిధంగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు.

ఇలా సదా వెబ్ సిరీస్ లలో నటిస్తూ మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇక ఈమె వ్యక్తిగత జీవితానికి వస్తే పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. ఈ విధంగా సదా పెళ్లి గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చిన ఆమె పెళ్లి మాటను దాటవేస్తున్నారు. అయితే తాజాగా సదా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Sadha: కొందరిని దూరం పెట్టాలి…

ఈ సందర్భంగా సదా మాట్లాడుతూ… మన జీవితాల్లోకి కొందరిని దూరంగా ఉంచడమే మంచిది. మన జీవితం చాలా చిన్నది.బలవంతంగా బంధాలలో ఉండటం కంటే ఒంటరిగా ఉండటమే మంచిది అంటూ ఈ సందర్భంగా సదా చేసినటువంటి ఈ కామెంట్స్ కనుక చూస్తే ఈమె ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఏమాత్రం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం సదా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.