సినీ నటుడు సాయిధరమ్ తేజ్ కి జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసామని, ఆ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడి 45 రోజులు చికిత్స పొందారు. ఆయన పూర్తిగా కోలుకున్న తరువాత ఇటీవల బయటకు వచ్చాడు.

ఈ నేపధ్యంలో ’91 CRPC కింద సాయిధరమ్ తేజ్ కు నోటీసులు జారీ చేసాం. అతని లైసెన్స్, బైక్ RC, ఇన్సురెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలన్నీ తమకు ఇవ్వాలని అడిగాం కానీ అతని నుంచి ఇప్పటివరకు ఎటువంటి వివరణ రాలేదు. త్వరలోనే సాయిధరమ్ తేజ్ పై చార్జ్ షీట్ దాఖలు చేస్తాం’ అంటూ స్పష్టం చేసారు హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.
































