వామ్మో ఆ షోలో గెలిచిన డబ్బును సమంత ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

0
743

వెండితెర పై స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ఎన్నో సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె తన సంపాదనలో కొంత భాగం ప్రత్యూష ఫౌండేషన్ కోసం వినియోగిస్తూ ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత విడాకుల అనంతరం మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరులు ఈ కార్యక్రమానికి వచ్చి అందరిని అలరింప చేశారు.

ఇప్పటికే సమంత ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి షూటింగ్ పూర్తి చేసిన నిర్వాహకులు ఈ ఎపిసోడ్ ను వచ్చే వారంలో ప్రసారం చేయనున్నట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ తో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారన్న సమాచారం వినబడుతోంది. ఈ ఈ కార్యక్రమంలో లో హాట్ సీట్లో ఉన్న సమంత ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెబుతూ ఎంతో చాకచక్యంగా ఆట ఆడినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా మీలో ఎవరు కోటీశ్వరులు ఈ కార్యక్రమంలో సమంత 25 లక్షలు గెలుచుకున్నట్లు తెలుస్తోంది. అయితే సమంతా ఈ మొత్తం డబ్బును తాను నిర్వహిస్తున్నటువంటి ప్రత్యూష ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం సమంత విడాకుల విషయంలో ఎంతో బాధపడుతుండగా ఆ బాధను బయటకు వ్యక్తం చేయకుండా తన సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ఉండటం చూసి నెటిజన్లు తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

విడాకుల అనంతరం సమంత గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలను ఖండించారు.ఇక జీవితంలో ఒంటరిగా పోరాడాలని నిర్ణయం తీసుకున్న సమంత విడాకుల తర్వాత వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.