గాంధీ జయంతి రోజున సమంత, నాగచైతన్య విడాకుల విషయంపై వారిద్దరు క్లారిటీ ఇచ్చేశారు. ఎప్పటి నుంచో వస్తున్న వార్తలు అన్నీ నిజమే అని నిన్నటితో తెలిసిపోయింది. ఈ వ్యవహారంపై నాగార్జున కూడా స్పందించిన విషయం తెలిసింది. వాళ్ల విడాకులపై కొంత మంది సానుభూతి చూపిస్తుంటే.. సిద్ధార్థ్ లాంటి వాళ్లు పరోక్షంగా విమర్శిస్తున్నారు.

మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు అంటూ సమంతను పరోక్షంగా అన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. దీనిపై బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తనదైన శైలి స్పందిస్తూ.. మహిళలకు సపోర్టుగా మాట్లాడారు. డైవర్స్ దాకా ఒక బంధం వచ్చిందంటే దానికి కారణం పురుషుడే అంటూ ఆమె వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి సమంత, నాగచైతన్య రిలేషన్ షిప్ పై ఆమె తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
ఏ జంట అయినా విడాకులు తీసుకుంటే దానికి కారణం కచ్చితంగా పురుషుడే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆ దేవుడు స్త్రీ, పురుషులను అలాగే సృష్టించాడు. విడాకుల సంస్కృతి రోజురోజుకీ బాగా పెరిగిపోతుంది అని కంగనా పేర్కొన్నారు.
సమంత, చైతు విడాకుల విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ.. ఇలా అన్నారు. ఓ బాలీవుడ్ నటుడిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. నాలుగు సంవత్సరాల వివాహ బంధానికి ఫుల్ స్టాఫ్ పెట్టేసి.. భార్యకు విడాకులు ఇవ్వడానికి.. పెళ్లికంటే ముందే 10 ఏళ్లు ప్రేమలో ఉన్న ఆ నటుడు ఇటీవల విడాకుల నిపుణుడైన బాలీవుడ్ సూపర్‌స్టార్‌ని కలిశారు. అతడి దర్శకత్వంలోనే ఇదంతా జరిగిందంటూ ఆమె పేర్కొన్నారు. తాను ఎవరి గురించి చెబుతున్నానో అర్థం అయ్యే ఉంటుందని ఆమె చెప్పారు.































