Samantha: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా నుండి ఇటీవల సమంత లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాని సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తమకు ఇష్టమైన గేమ్స్, ప్లేయర్స్, వాళ్ళ స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్స్… గురించి తెలిపింది. అంతే కాకుండా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పట్ల తనకి ఉన్న అభిమానం చాటుకుంది.
ఈ క్రమంలో సమంత మాట్లాడుతూ.. ” విరాట్ నాకు స్ఫూర్తి. ఒకానొక దశలో విరాట్ ఫార్మ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఒక భారీ సెంచరీ చేసి కమ్ బ్యాక్ ప్రకటించారు. కోహ్లి చేసిన ఆ చారిత్రాత్మక 71వ సెంచరీ నాకు ఎంతో స్పెషల్. ఆ రోజు నేను ఏడ్చేశాను అంటూ సమంత చెప్పుకొచ్చింది. అలాగే ధోని అంటే కూడా తనకు ఇష్టమని సమంత తెలిపింది .’

Samantha: ధోని అంటే కూడా ఇష్టం…
ఇక ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి తను ఫ్యాన్ అని తెలిపింది. ఇక విరాట్ కోహ్లీ గురించి సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ ఇద్దరూ కూడా ఖుషి సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినిమా యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.