కన్నడ పవర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ నేడు ఉదయం తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస విడిచారు. పునీత్ మరణించాడన్న వార్త తెలియడంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

సినీ ఇండస్ట్రీలో ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక గొప్ప నటుడు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో పలువురు నటీనటులు ఈయన మృతి పట్ల స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిజానికి పునీత్ కన్నడ నటుడు అయినప్పటికీ ఈయనకి తెలుగు నటీనటులతో ఎంతో మంచి అనుబంధం.
ఇక ప్రస్తుతం కన్నడనాట పరిశ్రమలో పవర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పునీత్ ను తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో గ్రాండ్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.అదేవిధంగా ఈయనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మంచి స్నేహబంధం ఉందని మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పునీత్ మరణించాడన్న వార్త పై ఎన్టీఆర్ స్పందిస్తూ అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
ఇలా గుండెపోటుతో పునీత్ మరణించడంతో ఆయన కళ్లను దానం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మన మధ్య లేకపోయినప్పటికి అతని కళ్ళు మాత్రం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాయి.ఇదిలా ఉండగా పునీత్ మరణించిన తర్వాత ఆయన కళ్ళను దానం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గతంలో పునీత్ తండ్రి కంఠీరవ రాజ్ కుమార్ మరణించినప్పుడు కూడా తన తండ్రి నేత్రాలను దానం చేశారు.
































