Satyadev: హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సత్యదేవ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటించి తన నటనతో మెప్పించారు. తాజాగా సత్యదేవ్ తమన్నాతో కలిసి నటించిన గుర్తుందా సీతాకాలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

డిసెంబర్ 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా విడుదల నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సత్యదేవ్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అలాగే ఎయిర్పోర్టులో తనని పోలీసులు అరెస్టు చేసిన సంఘటనలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఓ సినిమా షూటింగ్ నిమిత్తం తాను అఫ్గనిస్థాన్‌లో షూటింగ్ కోసం వెళ్లినప్పుడు ఒక చేదు అనుభవం ఎదురైందని తెలిపారు. అఫ్గనిస్తాన్ ఎయిర్ పోర్టులో.. ఈ దేశం ఎందుకు వచ్చారని ప్రశ్నించగా సినిమా షూటింగ్ కోసం వచ్చానని చెప్పడంతో పోయి ఈ దేశానికే రావాలా అంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆల్ ది బెస్ట్ అని ఓ చూపు చూసింది అన్నాడు. ఇదిలా ఉంటే.. తనను సూసైడ్ బాంబర్ అనుకుని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.

Satyadev: సూసైడ్ బాంబర్ అనుకోని పోలీసుల అరెస్టు చేశారు…
సాధారణంగా సూసైడ్ బాంబర్స్ ట్రిగర్స్ కాలి దగ్గర ఉంచుకుంటారట. ఆ విషయం నాకు ఏమాత్రం తెలియదని నా పక్కన ఉన్న వ్యక్తి పాస్ పోర్ట్ కాలి దగ్గర పెట్టుకున్నారు. దాన్ని తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే నేను కూడా తనకు సంబంధించిన వ్యక్తి అనుకుని పోలీసులు తనని అరెస్టు చేశారని ఈ సందర్భంగా సత్యదేవ్ తనకు ఆఫ్గనిస్తాన్ ఎయిర్ పోర్టులో జరిగిన చేదు సంఘటన గురించి చెప్పుకొచ్చారు.































