Senior actress PR Varalakshmi : నగరి కి చెందిన పిఆర్ వరలక్ష్మి గారు తెలుగు లోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇలా పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వందల సినిమాల్లో నటించిన వరలక్ష్మి గారు కృష్ణావతారం సినిమా ద్వారా తెలుగులో పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణం రాజు ఇలా అందరు హీరోలతో నటించిన ఆమె మహేష్ బాబు, బాలకృష్ణ ఇలా తరువాత తరం వారితోనూ నటించారు. తమిళంలో సీరియల్స్ లో నటిస్తున్న వరలక్ష్మి గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు అలానే తన కుటుంబం గురించిన విశేషాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు వరలక్ష్మి.

రోజాను కలవాలి…
నగరి నుండి వచ్చిన ఇద్దరు నాటీమనులుగా వరలక్ష్మి గారిని రోజా గారిని చెప్పొచ్చు. వరలక్ష్మి గారు రోజా గారి గురించి మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి రావాలని అనుకోవడం కాదు తనను ఇండస్ట్రీ కోరుకుంది. అలానే రాజకీయాల్లోకి అలానే వెళ్ళింది. ఇది కాకపోతే ఇది అంటూ ఒక రంగం నుండి ఇంకో రంగానికి పోలేదు ఆమె చేయాలనుకున్నవి కష్టపడి విజయవంతంగా చేసుకుంది.

తన గురించి వింటూ ఉంటాను. తన భర్త సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో నటించింది అయితే పెద్దగా పరిచయం లేదు. ఇక నా సొంతూరు నగరి లో మా తాతయ్య జమిందార్. మొత్తం 64 గ్రామాల భూములు మావే, అయితే ఇపుడు చాలా చోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. అందుకే నగరి ఎమ్మెల్యే గా రోజాను కలిసి మాట్లాడాలి. స్కూల్ కోసం అని భూమి ఇస్తే ఆ స్కూల్ చుట్టుపక్కల ఉన్న భూమిని కొంతమంది కబ్జా చేసేసారు. కొన్నిటికి డాకుమెంట్స్ కూడా సరిగా లేవు అందుకే వాటాన్నింటినీ పరిష్కరించుకోవాలి అని చెప్పారు.