Senior Heroine Divya Vani : బాపు గారి సినిమాల్లో హీరోయిన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది దివ్య వాణి. ‘పెళ్లి పుస్తకం’ సినిమాలో సత్యభామ గా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుంది. వాలు జడ, పెద్ద కళ్ళతో తెలుగింటి అమ్మాయి అంటే అలానే ఉండాలి అనేంతలా దివ్య వాణి అందం తెలుగు ప్రేక్షకులను ఆకర్శించింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దివ్య వాణి అసలు పేరు ఉషారాణి. ఆమె మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమాలో నటించిన తరువాత హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం ఇలా అన్నిభాషలలోనూ సినిమాలను చేసిన దివ్య వాణి తన కెరీర్ అలానే వ్యక్తిగత జీవితం గురించి అలాగే రాజకీయాల్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను, ఎందుకు టీడీపీ వీడాల్సి వచ్చిందో వివరించారు.

బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఏడ్చాను…
టీడీపీ లో క్రియాశీలకంగా పనిచేస్తూ ఫైర్ బ్రాండు గా పేరు తెచ్చుకున్న దివ్యవాణి అనూహ్యంగా ఆ పార్టీ నుండి బయటకు వచ్చేసింది. ఆ పార్టీలో కొంతమంది నాయకుల వల్ల తాను చాలా ఇబ్బందులు పడినట్లు, పైనున్న అధిష్టానంకి ఈ విషయాలేవీ తెలియవని నేను వాళ్లను తప్పు బట్టడం లేదంటూ చెప్పారు దివ్యవాణి. అయితే ఆ కొంత మంది నేతల వల్ల టీడీపీ నుండి బయటకు వచ్చేసానని తనని చాలా ఇబ్బంది పెట్టారంటూ చెప్పారు. టీడీపీ నుండి బయటికి వచ్చినపుడు బాలకృష్ణ గారి ఇంటికీ వెళ్లి ఆ నాయకుల గురించి వివరించి ఎంతలా తనను వేదించారో వివరించి ఏడ్చేశారట దివ్యవాణి. రీసెంట్ గా యూట్యూబ్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు. బాలకృష్ణ గారికి విషయాలను చెప్పగా నేను చూసుకుంటాను నాకు వీటి గురించి ఇతరుల నుండి సమాచారం వచ్చింది మీరు బాధపడొద్దు నేను చూసుకుంటా అని చెప్పారట.

ఇక దివ్య వాణి టీడీపి నుండి బయటకు వచ్చినపుడు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో టీడీపీ లీడర్స్ కొంత మందిని బాగా విమర్శించారు అలానే ఏడ్చారు కూడా. ఆ ప్రెస్ మీట్ చుసిన తన కుటుంబం రాజకీయాలు అవసరమా అని అడిగారట. అలానే కూతురు నువ్వేంటో మాకు తెలుసు, నువ్వు నిజాయితీగా మాట్లాడుతావు అందుకే భాదపడుతున్నావు అంటూ చెప్పిందట. ప్రస్తుతం టీడీపీ కి దూరంగా ఉంటున్న దివ్య వాణి భవిష్యత్ లో వైసీపీ వైపు అడుగులేయబోతున్నట్లు సమాచారం. అధికారికంగా ఇప్పటికీ ప్రకటించకపోయినా సంప్రదింపుల జరుగుతున్నాయి. తానే ప్రెస్ మీట పెట్టి అధికారికంగా తాను పార్టీలో చేరితే తప్పక చెబుతా అంటూ దివ్యవాణి ఇంటర్వ్యూలో తెలిపారు.



































