Senior Journalist Bhardwaja : బాలకృష్ణ హోస్ట్ గా వస్తున్న అన్ స్టాపబుల్ షో ఆహా ఒరిజినల్స్ కే సూపర్ హిట్. షో వల్ల మొత్తం ఆహా సబ్స్క్రిప్షన్ కొన్నవాళ్లు ఉన్నారు. రేటింగ్స్ లో దుమ్ములుపిన ఈ షో సీజన్ 2 వచ్చేసింది. ఇక మొదటి ఎపిసోడ్ తోనే మళ్ళీ రికార్డులను తిరగశారు ఆహా వాళ్ళు. ఏకంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ లు ఈ షోకి వచ్చి కనువిందు చేసారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో యూత్ హీరోలతో సందడి చేసి బాలయ్య రచ్చ చేసాడు. ఇక తాజాగా అందరూ ఎదురుచూస్తున్న హాట్ కాంబినేషన్ వచ్చేసింది. అదే పవర్ ప్యాక్ హై వోల్టెజ్ పవన్ కళ్యాణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్ ఇంటర్వ్యూ. ఇక ఈ పవర్ ప్యాక్ ఎపిసోడ్ మొదటి భాగం ఆహాలో ఆల్రడీ వచ్చేసింది. ఇక ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా వస్తారని ఆశించిన వారికి షాక్ తగిలింది. అయితే అసలు త్రివిక్రమ్ షోకి రాకపోడానికి కారణం ఏమిటి అన్నదాని గురించి వివరించారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు.

ఎందుకు త్రివిక్రమ్ రాలేదు…
గతంలో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో త్రివిక్రమ్. తో మాట్లాడిన బాలయ్య పవన్ తో పాటు ఎపిసోడ్ కి రావాలి అన్నట్లుగా మాట్లాడారు. దీంతో ప్రేక్షకులు కూడా వీరిద్దరి కాంబినేషన్ లో ఎపిసోడ్ ఉంటుంది అని భావించినా పవన్ కళ్యాణ్ మాత్రమే వచ్చారు కానీ త్రివిక్రమ్ రాలేదు. ఆయనకు బదులుగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి వచ్చారు. అయితే త్రివిక్రమ్, పవన్ ఇద్దరూ మంచి స్నేహితులు అలాంటిది ఎందుకు త్రివిక్రమ్ రాలేదు అనే విషయం గురించి భరద్వాజ మాట్లాడారు.

పవన్ చాలా తక్కువ మాట్లాడుతాడు. ఒకవేళ పవన్ తో పాటు త్రివిక్రమ్ కూడా వస్తే పవన్ కంటే త్రివిక్రమ్ ఎక్కువగా మాట్లాడాలి అలాగే ఆయన వాఖ్యలకు త్రివిక్రమ్ వాఖ్యానం ఇచ్చినట్లు ఉంటుంది. అలా కాకుండా షోలో బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు జవాబులు పవన్ చెప్పాలంటే పక్కన త్రివిక్రమ్ ఉండకూడదని భావించి ఉండవచ్చు. పవన్ మీద త్రివిక్రమ్ ప్రభావం చాలా ఉంది అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు. లెఫ్ట్ పార్టీల వైపు ఉన్న పవన్ ను రైట్ కి మార్చింది త్రివిక్రమ్ అంటూ తెలిపారు.































