Sharwanand:నటుడు శర్వానంద్ రక్షిత మెడలో జూన్ మూడవ తేదీ మూడు ముళ్ళు వేసిన విషయం మనకు తెలిసిందే. వీరి వివాహం జైపూర్ లోని శ్రీ లీల ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వివాహ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు ముఖ్యమైనటువంటి వారిని మాత్రమే శర్వానంద్ ఆహ్వానించారు.

ఇక జూన్ మూడవ తేదీ వీరి వివాహం జరగగా జూన్ 9వ తేదీ హైదరాబాదులో ఎంతో ఘనంగా రిసెప్షన్ వేడుకను నిర్వహించారు. ఈ క్రమంలోనే శర్వానంద్ ఈ రిసెప్షన్ కోసం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు అందరినీ ఆహ్వానించారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు అందరూ కూడా హాజరయ్యారు.
ఇక శర్వా నంద్ రామ్ చరణ్ చాలా ఆప్తమిత్రుడు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రామ్ చరణ్ శర్వానంద్ పెళ్లి కోసం జైపూర్ కూడా వెళ్లారు. అయితే ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో ఈమె ఈ పెళ్లికి హాజరు కాలేదు. ఇకపోతే తాజాగా హైదరాబాద్ లో జరిగిన రిసెప్షన్ వేడుకకు ఉపాసన హాజరయ్యారు. ఈమె నిండు గర్భిణీ కావడంతో రామ్ చరణ్ ఉపాసన చేయి పట్టుకొని తనని జాగ్రత్తగా నడిపించి తీసుకెళ్లారు. ఇలా ఇద్దరి జంట ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

Sharwanand: హాజరైన మంత్రి కేటీఆర్..
ఇక ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.అలాగే జీవిత రాజశేఖర్ దంపతులు తమ కూతుర్లతో హాజరయ్యారు. నిఖిల్, నితిన్, నరేష్ ఈ యంగ్ హీరోలు వారి భార్యలతో కలిసి ఈ వేడుకల్లో సందడి చేశారు. ఇక అమల బాలకృష్ణ దిల్ రాజు దంపతులు ఈ వేడుకలో సందడి చేశారు. ఇలా శర్వానంద్ వివాహ రిసెప్షన్ కి సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.































