Shivaji: సినీ నటుడు శివాజీ కేవలం సినిమాల గురించి మాత్రమే కాకుండా రాజకీయ అంశాల గురించి కూడా మాట్లాడుతూ వార్తలలో నిలుస్తున్నారు. ఇకపోతే ఈయన గత కొంతకాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానాన్ని ఆయన పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినటువంటి శివాజీ తరచూ వైకాపా పార్టీని ఆ పార్టీ నేతలను కూడా విమర్శిస్తూ ఉంటారు.

ఇకపోతే తాజాగా ఈయన పోసాని కృష్ణ మురళి పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి పోసాని కృష్ణమురళి గతంలో చంద్రబాబు నాయుడుని తప్పుపడుతూ ఆయనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. తాజాగా ఈ విషయం గురించి శివాజీ మాట్లాడారు. పోసాని గారు మనమంతా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళం మీరు ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు.
ఇలా నటుడిగా గుర్తింపు పొందిన మీరు ఎందుకు కులం మతం రాజకీయాలు అంటూ మాట్లాడుతున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు మీరు అలా నరాలు తెంచుకొని మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నించారు. వీలైతే మీరు కూడా పోసాని కృష్ణ మురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి అంతేకానీ చంద్రబాబు నాయుడు గారిపై ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు.

Shivaji: విషం వెళ్లగక్కారు..
చంద్రబాబు నాయుడు అంటే ఎందుకంత కోపం చంద్రబాబు నాయుడు గురించి అలాగే అమరావతి రాజధాని మీద ఎందుకు అంత కసి నాకర్థం కావడంలేదు. మీరే కాదు చాలామంది ఇలా విషం వెళ్లగక్కారు. ఇప్పుడు వారిలో చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటూ శివాజీ పోసాని గురించి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.




























