Shobhan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్న వారిలో నటుడు శోభన్ బాబు ఒకరు.తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి శోభన్ బాబు కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన అనంతరం హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.

ఇండస్ట్రీలో ఎంతో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈయన తన వారసులుగా ఇండస్ట్రీకి తన కొడుకులను పరిచయం మాత్రం చేయలేకపోయారు.ఇలా తన పిల్లలకి నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ శోభన్ బాబు మాత్రం తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా పెట్టారు. ఇలా శోభన్ బాబు తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా పెట్టడానికి గల కారణం ఏంటి అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.
ఈ క్రమంలోనే నటుడు రాజా రవీంద్రకు సైతం ఇదే ఆలోచన రావడంతో ఈయన శోభన్ బాబు గారిని ఇదే ప్రశ్న అడిగారట.అందుకు శోభన్ బాబు సమాధానం చెబుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో అవకాశాలను అందుకోవడం కోసం ఎన్నో అవమానాలను, కష్టాలను పడ్డాను.ఒక స్టార్ హీరో అయినప్పటికీ ఇండస్ట్రీలో తాను ఎక్కువ ఒత్తిడికి గురయ్యానని అలాంటి ఒత్తిడి అవమానాలు కష్టాలు తన పిల్లలకు వద్దన్న ఉద్దేశంతోనే వారిని ఇండస్ట్రీకి దూరం పెట్టానని శోభన్ బాబు తెలిపారట.

Shobhan Babu: భూమిపై ఇన్వెస్ట్ చేసిన శోభన్ బాబు…
ఇక శోభన్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ అందరిలాగా సినిమాలలోని ఇన్వెస్ట్ చేయకుండా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు.ఇలా అప్పట్లో శోభన్ బాబు కొన్న భూములు విలువ ఇప్పుడు కొన్ని వేల కోట్ల విలువ చేయడం విశేషం. ఇక శోభన్ బాబు కుమారులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వ్యాపార రంగంలో మంచిగా స్థిరపడ్డారని చెప్పాలి.































