కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. గతంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదు కాగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కరోనా వల్ల పెళ్లిళ్లు వాయిదా వేసుకున్న వాళ్లంతా పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.

ఈ నెల 29 నుంచి జనవరి నెల 7వ తేదీ వరకు మంచి మూహూర్తాలు ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కేంద్రం పెళ్లిళ్లకు పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులు హాజరు కావాలని సూచనలు చేసింది. అయితే పండితులు జనవరి 7 తర్వాత దాదాపు 4 నెలల పాటు మూహూర్తాలు లేవని తెలుపుతున్నారు. పెళిళ్లు చేసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

మంచి మూహూర్తాలు ఉండటంతో గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, వివాహాలకు ఇదే మంచి సమయమని పండితులు సూచిస్తున్నారు. 2021 జనవరి 16 నుంచి ఏప్రిల్ 30 వరకు మౌఢ్యమి ఉంది. మౌఢ్యమి వల్ల చాలామంది 7వ తేదీలోపు శుభకార్యాలు జరిగే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పండితులు పెళ్లిళ్లు ఎక్కువ సంఖ్యలో జరుగుతుండటంతో బిజీ అయిపోయారు.

మరోవైపు పరిమిత సంఖ్యలోనే వివాహ వేడుకలకు బంధుమిత్రులు హాజరు కానుండటంతో చాలామంది పెద్దపెద్ద ఫంక్షన్ హాల్స్ కు బదులుగా చిన్న ఫంక్షన్ హాల్స్ ను బుక్ చేసుకుంటున్నారు. కరోనా మహమ్మారి వల్ల పెళ్లిళ్ల ఖర్చులు సైతం భారీగా తగ్గిపోతాయని సమాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here