రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. మాస్క్ తీస్తే జైలు శిక్ష..!

0
242

దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి రైళ్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల గత కొన్ని నెలల నుంచి పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుస్తున్నాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. నవంబర్ నెల నుంచి పూర్తిస్థాయిలో ఎక్స్ ప్రెస్ రైళ్ల రాకపోకలు కొనసాగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

అయితే రైల్వే శాఖ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెబుతోంది. రైల్వేశాఖ ప్రయాణికులు స్టేషన్ లోకి ప్రవేశించిన నిమిషం నుంచి ప్రయాణం ముగిసే వరకు తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ నుంచి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలను పడేయడం, రైలులో లేదా స్టేషన్ లో ఉమ్మి వేయడం నిషిద్ధమని రైల్వే శాఖ తెలిపింది.

ఎవరైనా కరోనా లక్షణాలు కనిపించడం వల్ల శాంపిళ్లను ఇచ్చినా కరోనా పాజిటివ్ వచ్చినా ప్రయాణానికి దూరంగా ఉండాలని రైల్వే శాఖ సూచిస్తోంది. ఎవరైనా రైల్వే శాఖ నియమనిబంధనలను పాటించకపోతే వారికి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తామని కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంటుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రైల్వే శాఖ క్రమంగా రైళ్ల సంఖ్యను పెంచాలని భావిస్తోంది.

2021 జనవరి నాటికి ప్యాసింజర్ రైళ్లు కూడా అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ భావిస్తోంది. అప్పటిలోపు కరోనా వైరస్ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ప్రజల్లో కరోనా వైరస్ గురించి భయాందోళన తగ్గడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here