Health Tips: మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. సరైన పద్ధతిలో పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో తల్లి తీసుకునే ఆహారం మీద బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుకుందాం…ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు సమయానుకూలంగా పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, ఒత్తిడి లేకుండా ఉండటం చాలా ముఖ్యం.

పోషకాలు ఎక్కువగా ఉండే పండ్లు,కూరగాయలు ,పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్, మాంసం వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా జీడిపప్పు,బాదం పప్పు ,వేరుశెనగలు, పిస్తా పప్పు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
సముద్రపు చేపలు హానికరం…
ప్రెగ్నెంట్ గా ఉన్న మహిళలు రోజువారి ఆహారంలో బీట్ రూట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే రక్తహీనత సమస్యను బీట్రూట్ నియంత్రిస్తుంది. శరీరంలో రక్తం శాతం సమృద్ధిగా ఉండాలంటే దానిమ్మ పండ్లు ఎక్కువగా తినాలి. బీట్ రూట్ , ఎండు ఖర్జూరం లో శరీరానికి అవసరమైన ఐరన్ , ఫోలెట్ ఎక్కువగా ఉంటాయి.ప్రెగ్నెన్సీ సమయంలో మాంసం తినటం చాలా అవసరం. ముఖ్యంగా ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు చాపలు తినడం ఎంతో అవసరం. కానీ సముద్రంలో లభించే చేపలను తినటం కన్నా మంచి నీటి చెరువులో లభించే వాటిని తినటం శ్రేయస్కరం. సముద్రపు చేపల లో పాదరసం ఎక్కువగా ఉంటుంది.



































