Shriya Saran: శ్రియా శరణ్ ఫిలిం ఇండస్ట్రీకు పరిచయం అక్కర లేని పేరు. తన గ్లామర్ తో నటనలో ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఇష్టం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలక్రిష్ట, వెంకటేష్ వంటి అగ్ర తారలతో నటించింది.

మరోవైపు తరుణ్, మహేష్, ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ వంటి యంగ్ జనరేషన్ హీరోల సరసన హీరోయిన్ గా చేసి మెప్పించింది. రెండు దశాబ్ధాలుగా వెండితెరపై వెలిగిపోయింది. అయితే తాజాగా సినిమా ఆఫర్లు తగ్గినా.. ఏదో ఒక విషయంలో ట్రెండింగ్ లో ఉంటోంది శ్రీయ.

2018లో రష్యా దేశస్థుడు ఆండ్రూ కొశ్చివ్ ని పెళ్లాడింది. తన భర్తతో ఉన్న ఫోటోలను తరుచూ సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది శ్రియ. తాజాగా మరోసారి భర్తతో ఘాటుగా లిప్ లాక్ ఇస్తున్న ఫోటోలను మళ్లీ సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో పాటు వైట్ బికినీతో సమ్మింగ్ ఫూల్ లో ఉన్న ఫోటో షేర్ చేసింది.
ఆర్ఆర్ఆర్ సినిమా.. కీలక పాత్రలో శ్రీయ..
ఈ ఫోటోలకు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. వయసు నలబైకి దగ్గర పడుతున్నా.. శ్రియలో అందం తగ్గలేదని అనుకుంటున్నారు నెటిజెన్లు. ఇటీవల ‘గమనం’ సినిమాలో నటించిన శ్రియ. తన యాక్టింగ్ తో అందర్ని మెప్పించింది. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గన్ భార్యగా శ్రియ కనబడబోతోంది. అయితే ప్రస్తుతం శ్రియకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తుంది.






























