టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్లకు మళ్ళీ ఛాన్సులు రావడం చాలా కష్టం.. కానీ శ్రుతిహాసన్ కి మాత్రం ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.. గత కొంతకాలంగా అసలు సినిమా ఆఫర్లే లేని ఈ ముదురు భామకి ఇప్పుడు వరుస హిట్స్ వస్తున్నాయి.. ఈ ఏడాది ప్రారంభంలో రవితేజ సరసన క్రాక్ సినిమా తో సాలిడ్ హిట్ అందుకుంది అందాల భామ శృతిహాసన్ . ‘క్రాక్’ సినిమా బాక్సాఫీసు వద్ధ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ మూవీ హిట్‏తో శృతిహాసన్ తిరిగి ఫాంలోకి వచ్చింది. దీంతో ఈ అమ్మడుకి భారీగానే ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సలార్’ మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముందుగా బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ నటించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ సలార్‏లో శృతిహాసన్ నటించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం.

ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సలార్.. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ మాస్ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ ఇదే అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో శృతి ఓ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం గా ఉండబోతుందని అంటున్నారు.

ప్రస్తుతం సలార్ సెట్ హైదరాబాద్ శివారులో రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం భారీ సెట్లను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదల కాబోతుంది…ఇక పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కనుక హిట్ అయితే మళ్ళీ శ్రుతిహాసన్ కి టాలీవుడ్ లో తిరుగుండదనే చెప్పాలి.అన్నట్టు ప్రభాస్ తో ఈ అమ్మడు నటించే తొలి సినిమా ఇదే కావడం విశేషం..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here