Shruti Hassan: తన ప్రియుడిలో అవి అంటే చాలా ఇష్టం అంటున్నారు శృతిహాసన్… వైరల్ అవుతున్న శృతి కామెంట్స్!

0
36

Shruti Hassan: నటి శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి బాలకృష్ణ చిరంజీవి వంటి హీరోల సినిమాలలో నటించి సూపర్ సక్సెస్ అందుకున్నటువంటి శృతిహాసన్ ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈమె ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇప్పటివరకు శృతిహాసన్ ప్రభాస్ తో కలిసి నటించలేదు. మొదటిసారి ప్రభాస్ తో కలిసి ఈమె సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె తన ప్రియులకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.

ఈ విధంగా శృతిహాసన్ తనకు వీలు దొరికినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించడమే కాకుండా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు అయితే తాజాగా ఈమె అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు ఈ క్రమంలోనే మీకు వంట చేయడం వచ్చా అని ప్రశ్నించగా తాను బాగా వంట చేస్తానని శంతను బాగా తింటారని తెలిపారు.

Shruti Hassan: అతని కళ్ళు అంటే ఇష్టం…


మీరిద్దరూ పోట్లాడితే ఎవరు ముందుగా సారీ చెబుతారు అని అడగడంతో తానే ముందుగా సారి చెబుతానని శృతిహాసన్ తెలిపారు. ఇక మీ బాయ్ ఫ్రెండ్ లో మీకు నచ్చే లక్షణాలు ఏంటి అని అడగడంతో ఈమె తన బాయ్ ఫ్రెండ్ పై ప్రశంసలు కురిపించారు. శాంతను. అతను ఎంతో తెలివైనవాడు అని.. తనను బాగా నవ్విస్తాడని.. కాస్త వింతగా కూడా ప్రవర్తిస్తాడని.. అన్నింటికంటే ముఖ్యమైనది తనను ఎక్కువగా ఇష్టపడతాడని చెప్పుకొచ్చింది.ఇంకా అతని కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అంటూ ప్రియుడు గురించి శృతిహాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.