సాధారణంగా మనం పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అనే సామెతను వింటూనే ఉంటాం.సామెత మాట పక్కన పెడితే నిలబడి నీళ్లు తాగితే మాత్రం చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే మంచిదని తెలుసుగానీ, నీళ్లను నిలబడి తాగకూడదని చాలా మందికి తెలియదు. ఇలా నిలబడి నీళ్లు తాగడం వల్ల కలిగే ఆ ప్రమాదాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నిలబడి నీళ్ళు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుంది. తాగిన నీళ్లు వేగంగా వెళ్లి పొత్తికడుపుపై ప్రభావం చూపుతాయి. ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది.దీనితో టాక్సిన్స్ పెరుగుతాయి.నిలబడి నీళ్లు తాగినప్పుడు నరాలు ఉద్రిక్తత స్థితిలో ఉంటాయి.శరీరంలో విషపదార్ధాలు,అజీర్ణాన్ని పెంచుతుంది. ఇలా చేయడం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది.
ఎందుకంటే నిలబడి నీరు తాగడం వల్ల కీళ్ళలో ద్రవాలు పేరుకుపోతాయి. తద్వారా ఆర్థరైటిస్ సమస్యలు, కీళ్ల నొప్పులు వస్తాయి.నిలబడి నీటిని తాగినప్పుడు అవసరమైన పోషకాలు, విటమిన్లు కాలేయం, జీర్ణవ్యవస్థకు చేరవు. మీరు నిలబడి నీరు తాగినప్పుడు అవి శరీరంలోకి వేగంగా వెళుతాయి. దీనివల్ల ఆక్సిజన్ స్థాయి చెదిరిపోతుంది. కాబట్టి ఊపిరితిత్తులు గుండె పనితీరును ప్రమాదంలో పడేస్తుంది.
కూర్చున్నప్పుడు మన కిడ్నీలు బాగా ఫిల్టర్ అవుతాయని చాలా నివేదికలలో తేలింది. నిలబడి నీరు తాగినప్పుడు నీరు దిగువ పొట్టకు ఎలాంటి వడపోత లేకుండా వెళుతాయి. దీని వల్ల మూత్రాశయంలో నీటి మలినాలు చేరి మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. మూత్ర నాళాల రుగ్మతలను కలిగిస్తుంది.నీరు తాగడానికి సరైన మార్గం ఏంటంటే కుర్చీపై కూర్చుని, వెన్న భాగాన్ని నిటారుగా ఉంచి నీళ్లు తాగాలి.




























