సాధారణంగా ఎండల కాలం వచ్చిందంటే చాలు వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఉన్నఫలంగా పెరిగిపోతాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఎంతో అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. అదే విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల ప్రతి ఒక్కరు డిహైడ్రేషన్ కి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ క్రమంలోనే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే ఎక్కువ శాతం నీటిని తీసుకోవడంతోపాటు ఎక్కువ నీరు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎండల నుంచి కొంత వరకు ఉపశమనం పొందవచ్చు. ఎండల తీవ్రతను తట్టుకోవాలంటే ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

పుదీనా: వంటలలో ఎంత రుచిని కలిగించేటటువంటి పుదీనాను వేసవి కాలంలో తీసుకోవటంవల్ల వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. పుదీనాకి అధికశాతం రిఫ్రెష్ కలిగించే స్వభావం ఉంటుంది. కనుక తరచూ పుదీనాను కూల్ డ్రింక్ లోకి వేసుకొని తాగడం లేదా ఇతర వంటకాలలో వేసుకుని తినడం ద్వారా వేసవి తాపం నుంచి విముక్తి పొందవచ్చు.
గంధం చెక్క: గంధపుచెక్కకు మన శరీరానికి చల్లదనం గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గంధపుచెక్కను అరగదీసి ఆ మిశ్రమంతో మన చర్మానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవడం వల్ల మన చర్మాన్ని ఎంతో చల్లదనంగా ఉంచడంలో దోహదపడుతుంది. గంధపు చెక్కలు చల్లదనం ఇచ్చే లక్షణాలు అధికంగా ఉండటం వల్ల వేసవిలో ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
నీటి శాతం కలిగిన పండ్లు: వేసవి కాలంలో ఎక్కువ భాగం అధిక నీటిశాతాన్ని కలిగిన పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఎల్లప్పుడు తేమగా ఉంచడానికి దోహదపడుతుంది. ఈ క్రమంలోనే పుచ్చకాయలు, కీర దోసకాయలు, నారింజ,కర్బూజ వంటి పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల అధిక శాతం నీరు మన శరీరానికి అందుతుంది. తద్వారా మన శరీరం శక్తిని కోల్పోకుండా, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు.































