ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి మండల పర్యటనలో జరిగిన దుర్ఘటనపై మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుంటూరు జిల్లా రెంటపాళ్ల గ్రామం వద్ద జరిగిన ఈ ఘటనలో, సింగయ్య అనే వ్యక్తి సీఎం జగన్ కాఫిల్లో ఉన్న ఓ వాహనం కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వైరల్ అయిన వీడియోలో స్థానికులు “వ్యక్తి కింద పడ్డాడు” అని ఎంతగా అరిచినా వాహనం ఆగకుండా ముందుకు సాగిన దృశ్యం కనిపిస్తోంది.

వీరాభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా జగన్ వాహనం ముందు దూసుకొచ్చారు. అపసవ్యతగా ఏర్పడిన తొక్కిసలాటలో సింగయ్య అనే వ్యక్తి వాహనం ముందు టైర్ కిందకి పడిపోయారు. అతడిని తొక్కి ఓ టాటా సఫారీ (AP 26 CE 0001) వెహికల్ వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పందిస్తూ, “సింగయ్య కుటుంబం నుండి ఫిర్యాదు వస్తే, విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకుంటాం” అని పేర్కొన్నారు.
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే ప్రజలు విచారం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా “ఒక వ్యక్తి ప్రాణం పోయిందని తెలిసినా వాహనం ఆగకుండా ముందుకెళ్లడం.. ప్రాణం అంటే ఎంత నిర్లక్ష్యం?” అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సింగయ్య కుటుంబానికి న్యాయం జరగాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
సత్తెనపల్లి పర్యటనలో #YSJagan వాహనం కింద పడి ఓ వ్యక్తి మృతి.#YSRCP #tdp #Appolitics pic.twitter.com/4GAnKPQt4t
— TeluguDesk (@telugudesk) June 22, 2025


































