Singer Sunitha: సింగర్ సునీత పరిచయం అవసరం లేని పేరు తెలుగు చిత్ర పరిశ్రమంలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సునీత రెండవ వివాహం ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఈమె గత రెండు సంవత్సరాల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని రెండవ వివాహం చేసుకున్నారు.

ఇలా సునీత రెండవ వివాహం చేసుకోబోతోంది అని తెలియడంతో పెద్ద ఎత్తున ఈమె గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఒకప్పుడు ఆమెను విమర్శించిన వారే ఇప్పుడు తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తన గురించి విమర్శలను పట్టించుకోకుండా తన జీవితంలో సంతోషంగా ఉండడం కోసం సునీత ముందడుగు వేశారు.
ఇలా సునీత మ్యాంగో మీడియా అధినేతను వివాహం చేసుకోబోతున్నారని విషయం తెలియడంతో అప్పట్లో ఈయన గురించి పెద్ద ఎత్తున అందరూ సర్చ్ చేసారు. అయితే ఈయన డిజిటల్ మీడియాలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని ఈయన పేరిట వందల కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇలా మ్యాంగో మీడియా కోసం సునీత ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ఆ సమయంలోనే ఇతనితో పరిచయం ఏర్పడి స్నేహంగా మారిందని తెలుస్తోంది.

Singer Sunitha: ఐదు సంవత్సరాలు పెద్దవారు…
ఇలా ఏర్పడిన పరిచయం స్నేహం చివరికి వీరిద్దరిని పెళ్లి బంధం వైపు అడుగులు వేసేలా చేసింది.ఇక వీరిద్దరి పెళ్లి సమయంలో వీరిద్దరి మధ్య వయస్సు తేడా ఎంత ఉంటుందని ఆరా తీయగా తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం ఏంటో తెలుస్తోంది. రామ్ వీరపనేని మే 26, 1974న జన్మించాడు. సునీత వయసు 42 సంవత్సరాలు. ఇద్దరి మధ్య కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే వయసు తేడా ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.