బిగ్ బాస్ కార్యక్రమం చూస్తుండగానే చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోని కంటెస్టెంట్ ల మధ్య నువ్వా నేనా అన్నట్టు గా పోటీ నెలకొంది ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో భారీగా తలపడుతున్న కంటెస్టెంట్ లకు బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్ అంటూ కంటెస్టెంట్ లకు శుభవార్త చెప్పారు.

ఈ టాస్క్ లో భాగంగా ఎవరైతే గెలుస్తారోవాళ్ళు డైరెక్ట్ గా ఫినాలేకి వెళ్లే అవకాశం దక్కుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ టాస్క్ లో భాగంగా మొదటి లెవెల్ జరుగుతుంది. ఈ లెవెల్ లో భాగంగా కంటెస్టెంట్ లు ఐస్ క్యూబ్ పై నిలబడాల్సి ఉంటుంది. ఇలా ఐస్ క్యూబ్ పై నిలబడుతూ పక్కవారి బంతులను లాక్కోవాలి. ఇక టాస్క్ లో భాగంగా మరోసారి సన్నీ, సిరి మధ్య గొడవ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ టాస్క్ కి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఇందులో సిరి, సన్నీ మధ్య గొడవ చోటు చేసుకోవడంతో సిరి గట్టిగా ఏడ్చినట్టు తెలుస్తుంది. ఇక సన్నీ సిరిని ఉద్దేశించి ఒకరిని విలన్ చేయడానికి తాను సిద్ధంగా ఉంటుందని అన్నారు.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ టాస్క్ లో భాగంగా మానస్ అధిక పాయింట్లతో గెలిచాడని తెలుస్తోంది. మరి ఈ టికెట్ టు ఫినాలే రౌండ్ లో ఎవరు గెలుస్తారు ఫైనల్స్ కి ఎవరు వెళ్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ వారం నామినేషన్లు భాగంగా సన్నీ, షణ్ముఖ తప్ప మిగిలిన ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు అయితే వీరిలో ఎక్కువగా సిరి లేదా ప్రియాంక ఈ వారం ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.































