కరోనా మొదటి వేవ్ లో ఎంతో మంది వలస కార్మికులకు అండగా నిలిచాడు సోనూసూద్. సొంత డబ్బులను వెచ్చించి రవాణా సౌకర్యాలను కల్పించాడు ఈ రియల్ హీరో. అప్పటి నుంచి ఎంతో మందికి అండగా నిలస్తూ ఎంతో మంది గుండెల్లో దేవుడిగా నిలిచాడు. పేదల పాలిట ఆపద్బాంధవుడిలా మారాడు. కాగా, సోనూసూద్ కొద్దిరోజుల నుంచి కొత్త అవతారం ఎత్తాడు.

మరిన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు మద్దతుగా నిలుస్తున్నాడు. రహదారుల వెంట దుకాణాలు నడుపుకునే చిరు వ్యాపారులకు నేనున్నానంటూ భరోసానిస్తున్నాడు. అయితే నేడు(జూలై 30) సోనుసూద్ పుట్టినరోజు. దీంతో అతడిపై అభిమానాన్ని ప్రతీ ఒక్కరూ ఎదో ఒక విధంగా చాటుకుంటున్నారు.
కొంతమంది ఆయన పేరును షాపులకు పెట్టుకుంటుంటే మరికొందరు ఏకంగా వారి పిల్లలకు సోనూ అని పేరు పెట్టుకుంటున్నారు. ఇంకొంత మంది ఆయనకు గుడి కట్టి దైవంగా కొలుస్తున్నారు. ఇక ఆయనను అమితంగా ఇష్టపడే వారు నడుచుకుంటూ సోను ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి ఆయనను కలుస్తున్నారు. అభిమానలు సోనూ భాయ్ అని పిలిస్తే ఎక్కడికంటే అక్కడకు టక్కున వచ్చి వాలుతున్నాడు.
అయితే అతడి బర్త్ డే సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి పుట్టిన రోజుకు సెలబ్రేట్ చేసుకున్నారు సోను. పలువురు సినిమా తారాలు, అభిమానులు అతడికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో కొంత మంది అతడి పుట్టిన రోజు వేడుకను ఓ పండగలా జరుపుకుంటున్నారు.






























