టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది.. ఇక తన కెరీర్ మొదట్లో వరుసగా సినిమాలను చేయడం.. అవి సరిగా ఆకట్టుకోకపోవడంతో ఆ మధ్య కేరీర్ పరంగా కొంత సతమతమయ్యింది..దీంతో శృతి హాసన్ కి స్టార్ హీరోల సరసన ఆఫర్స్ పెద్దగా రావడం లేదు. గబ్బర్ సింగ్ సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో ఆమె ప్రేమలో పడింది.ఇక ఆమె నటించిన మహేష్ బాబు కొరటాల శివ శ్రీమంతుడు మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. రామ్ చరణ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన ఎవడు సినిమా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇక చాలా గ్యాప్ తర్వాత తెలుగులో శృతి హాసన్ తాజాగా రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటించి బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ప్రస్తుతం శృతి హాసన్ పలు తెలుగు సినిమాలు చేస్తోంది..అది అలా ఉంటే కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో శృతి కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసింది..ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. బిజినెస్ మ్యాన్: మహేష్ బాబు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శృతి హాసన్‌నే అనుకున్నారట. కానీ ఆమె ఏవో కారణాలతో రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం చందమామ కాజల్ అగర్వాల్‌కు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

2. జెర్సీ: నాచురల్ స్టార్ నాని హీరో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన జెర్సీ సినిమాలో కూడా శృతి హాసన్‌ను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కూడా శృతిహాసన్ కోల్పోయింది.

3. అమర్ అక్బర్ ఆంటోనీ : మాస్ మహారాజా రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో కూడా శృతిని అనుకున్నారట. కానీ ఈ సినిమాను కూడా శృతి రిజెక్ట్ చేసింది.

4. దువ్వాడ జగన్నాధం Dj : అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాధం’ సినిమా లో కూడా శృతి హాసన్ నే హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారట. కానీ శృతి రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు.

5. రెబెల్: ప్రభాస్, లాఘవ లారెన్స్ కాంబినేషన్‌లో వచ్చిన రెబెల్‌లో కూడా శృతి హాసన్‌ను మొదట అనుకున్నారట. కానీ ఆమె వదులుకోవడంతో ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించింది..

అలా మొత్తానికి శృతిహాసన్ ఐదు సినిమాలు మిస్ చేసుకుంటే.. అందులో మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వడం విశేషం…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here