హైతీలో దేశంలోని నైరుతి ప్రాంతంలో శనివారం 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల దాటికి శిథిలావస్థకు చేరిన భవనాలు కుప్పకూలడంతో 304 మంది మరణించారు. కనీసం 1800 మంది గాయపడ్డారు. సెయింట్ లూయిస్-డు-సుడ్‌కు ఈశాన్యంగా 12 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.

ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైతీలో 2010, జనవరి 12న 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా వేలమంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారితో ఆసుపత్రులు రద్దీగా మారాయి. ప్రధాన మంత్రి ఏరియల్ హెన్రీ భూకంపం సంభవించిన ప్రాంతాలకు సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
































