విద్యార్థుల కోసం స్టూడెంట్ క్రెడిట్ కార్డ్… ఈ పథకం ద్వారా రూ.10 లక్షల వరకూ రుణం..!

0
183

పశ్చిమ బెంగాల్ లో ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మమతాబెనర్జీ పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే విద్యార్థుల కోసం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా సరికొత్త పథకాన్ని తీసుకు వచ్చారు. విద్యార్థులు పై చదువుల కోసం, పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోచింగ్ కోసం వారికి రుణాలను ఇవ్వడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందుకు వచ్చింది.

“స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ “అనే విన్నూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద విద్యార్థులు ఎటువంటి షూరిటీ లేకుండా ఒకేసారి పది లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఉంటుందని ఈ సందర్భంగా మమతా బెనర్జీ తెలియజేశారు. ప్రతి విద్యార్థి వారు కన్న కలలను సహకార చేసుకోవడానికి పదవతరగతి విద్యార్థుల నుంచి వారి పై చదువుల కోసం ఈ పథకం వర్తిస్తుందని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.

స్టూడెంట్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న 10 లక్షల రూపాయల రుణాన్ని విద్యార్థులు 15 సంవత్సరాల లోపు చెల్లించాలి. ఈ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణాలు విద్యార్థులు తమ చదువుల కోసం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అయ్యే వారు వారి కోచింగ్ సెంటర్లకు, పుస్తకాలకు హాస్టళ్లకు పలు విద్య అవసరాలకు ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు.

ఈ పథకానికి 40 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు కూడా రుణాన్ని పొందవచ్చని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు. చాలామందికి చదువుపై ఆసక్తి ఉన్నప్పటికీ వారు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చదువులు మధ్యలోనే ఆపేసి ఉన్నారు. ఈ క్రమంలోనే అలాంటివారి కోసమే వయస్సును పెంచినట్లు తెలిపారు. ఈ కార్డు ద్వారా విద్యార్థులు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులలో రుణాలు పొందవచ్చు.ఈ విధంగా ఈ కార్డును ఉపయోగించి ఎవరైతే మోసాలకు తెరలేపుతారో వారిపై కఠిన చర్యలను కూడా తీసుకోనున్నారని ఈ సందర్భంగా మమతా బెనర్జీ తెలియజేశారు.